ఈడీ విచారణ మధ్యలోనే సోనియా గాంధీని కలిసిన రాహుల్‌

13 Jun, 2022 16:16 IST|Sakshi
సోదరి ప్రియాంకతో రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: ఈడీ విచారణ మధ్యలోనే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(51), తన తల్లి సోనియా గాంధీని కలుసుకున్నారు. కొవిడ్‌ బారిన పడ్డ సోనియా గాంధీ ప్రస్తుతం గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ తరుణంలో సోమవారం ఈడీ విచారణ జరుగుతున్న సమయంలోనే.. మధ్యాహ్నం భోజన విరామం ఇచ్చారు ఈడీ అధికారులు. దీంతో ఇంటికి వెళ్లి భోజనం చేసి.. ఆపై సోదరి ప్రియాంకతో కలిసి  రాహుల్‌ గాంధీ, గంగారాం ఆస్పత్రికి వెళ్లారు. సోనియాను వాళ్లు పరామర్శించినట్లు తెలుస్తోంది. ఇక లంచ్‌ బ్రేక్‌ తర్వాత రాహుల్‌ గాంధీ, తిరిగి ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. ప్రస్తుతం రెండో విడత విచారణ కొనసాగుతోంది.

చదవండి: సోనియా ఫ్యామిలీపై ఈగ వాలినా ఊరుకునేది లేదు

మరిన్ని వార్తలు