కరోనా కట్టడి: జాతీయ మానవ హక్కుల సంఘం కీలక మార్గదర్శకాలు

11 May, 2021 12:46 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: కరోనా కట్టడిపై జాతీయ మానవహక్కుల సంఘం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రియల్‌ టైం డ్యాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొంది. డ్యాష్‌ బోర్డులో ఆస్పత్రులు, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు, మందుల వివరాలు నమోదు చేయాలని సూచించింది.

ఆక్సిజన్‌, మందులను బ్లాక్‌మార్కెట్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల సంఘం ఆదేశించింది.ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని పేర్కొంది. అందరికీ టీకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు, కరోనా యోధుల రక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. నిత్యావసర వస్తువులు అమ్మే వేళలను తగ్గించాలని జాతీయ మానవహక్కుల సంఘం పేర్కొంది.

చదవండి: డబుల్‌ మాస్క్‌పై కేంద్రం కీలక మార్గదర్శకాలు
కొంత ఊరట.. దేశంలో రెండో రోజూ తగ్గిన కేసులు

మరిన్ని వార్తలు