పంజాబ్‌లో పవర్‌ రచ్చ,ముందు మీ 8 ల‌క్ష‌ల బిల్లు చెల్లించండి సిద్ధూ...

3 Jul, 2021 19:06 IST|Sakshi

చండీగడ్: ప్రస్తుతం విద్యుత్త్‌ కొర‌త సమస్యతో పంజాబ్‌ రాష్ట్రం ఇబ్బందులు పడుతోంది. ఇక ఈ అంశంపై అమ‌రీంద‌ర్ పాల‌న స‌రిగా లేద‌ని అదే పార్టీకి చెందిన నాయకుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఇటీవల ఫైర్ అయిన సంగతి తెలిసిందే. విద్యుత్త్‌ సమస్యలపై అంతలా విరుచుకుపడ్డ సిద్ధూ తన ఇంటి కరెంట్‌ బకాయిలు చెల్లించడం మారిచారన్న విమర్శలు వస్తున్నాయి.

అమృత్‌స‌ర్‌లో ఉన్న సిద్ధూ ఇంటికి క‌రెంటు బిల్లు బాకీ ఉన్నట్లు తెలియడంతో ఈ అంశం ఇప్పుడు విపక్షాలకు అస్త్రంలా దొరికింది. ఈ కాంగ్రెస్ నేత మొత్తం రూ.8,67,540 క‌రెంటు బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే బిల్ పేమెంట్‌కు జూన్‌ 2 చివ‌రి రోజు కాగా ఇంతవరకు ఆయన చెల్లించలేదు. దీని గురించి ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధూ ఏమీ మాట్లాడ‌లేదు. ఇదిలా ఉండగా ఆప్‌ పార్టీ అధికారంలోకి వ‌స్తే 300 యూనిట్ల క‌రెంటును ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పేర్కొనడం విశేషం.

2019లో రాజీనామ చేసిన స‌మ‌యంలో ఆ శాఖ‌ను సిద్దూకే కేటాయించే ప్ర‌య‌త్నం చేశారు. పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం.. అమృత్‌స‌ర్‌లోని సిద్ధూ ఇంటికి రూ. 8,67,540 విద్యుత్త్‌ బకాయిలు ఉండగా ఇంకా చెల్లించలేదని తెలిపింది. అసలు ఈ కరెంట్‌ కథేంటంటే.. గత సంవత్సరం నుంచి సిద్దూ ఇంటి కరెంట్‌ బిల్లు విషయంలో 17 లక్షలకు పైగా బాకీ పడ్డాడు. కాగా అతను మార్చిలో 10 లక్షలు చెల్లించగా, ప్రస్తుతం అతని బకాయిలు దాదాపు 9 లక్షలకు చేరుకున్నాయని వారు తెలిపారు.

మరిన్ని వార్తలు