గడ్డకట్టే నీటిలో అన్వేషణ.. ఎందుకంటే?

21 Feb, 2021 15:41 IST|Sakshi

ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని తపోవన్‌ సరస్సు లోతును కనుగొనడాన్ని ‘నేవీ డైవర్స్’‌‌ సవాల్‌గా తీసుకున్నారు. వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో ఏర్పడిన అత్యంత ప్రమాదకరమైన భారీ కృత్రిమ సరస్సు సముద్రమట్టానికి 14 కిలో మీటర్లు పైకి ఎగిసి అల్లకల్లోలం సృష్టిస్తోందని తెలిపారు. ఈ విపత్తులో చాలా మంది ప్రాణాలు కోల్పోగా మరికొంత మంది జాడ తెలియటంలేదని పేర్కొన్నారు. తపోవన్‌ సరస్సు అ‍త్యధికంగా గడ్డకట్టే పరిస్థితులను కలిగి ఉందని, అందుకే నేవీ అధికారులు సరస్సు లోతును కనుగొనడానికి ఎకోసౌండర్‌ పరికరాన్ని ఉపయోగిస్తున్నారని తెలిపారు.


డామ్‌పై నీటి ఒత్తిడిని హై రిజల్యూషన్‌ ఉపగ్రహంతో అధ్యయనం చేస్తున్నారు. నీరు అధిక బరువును కలిగి ఉందని భవిష్యత్తులో ఎప్పుడైనా డ్యామ్‌ను ఢీ​కొట్టి మరో వరదకు కారణమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఘర్వాల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ వైపీ సండ్రియల్‌ వరద సంభవించిన ప్రదేశంలో పర్యటించి వరదకు గల కారణాలను అధ్యయనం చేశారు. ఏ క్షణంలో అయినా వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడానికి  వైమానిక దళానికి చెందిన అత్యాధునిక లైట్‌ హెలికాప్టర్‌ను ఉపయోగిస్తామని తెలిపారు. 

చదవండి: ఉత్తరాఖండ్‌ ముంగిట మరో ముప్పు

మరిన్ని వార్తలు