అమిత్‌ షాతో భేటీలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌, ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత

26 Sep, 2021 10:41 IST|Sakshi

హాజరైన సీఎం కేసీఆర్‌, ఏపీ డిప్యూటీ సీఎం మేకతోటి సుచరిత

హాజరైన పది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆ రాష్ట్ర ప్రతినిధులు

సాక్షి, న్యూఢిల్లీ: వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సమావేశం ఆదివారం ఉదయం ప్రారంభమైంది. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ ఈ కీలక సమావేశం నిర్వహించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ప్రారంభమైన ఈ సదస్సుకు వామపక్ష తీవ్రవాద ప్రభావితం ఉన్న 10 రాష్ట్రాలు హాజరయ్యాయి. తెలంగాణ, ఏపీతో పాటు చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన వారు హాజరయ్యారు.

సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు హాజరయ్యారు. అయితే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కావాల్సి ఉండగా అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు