బీజేపీ నేతలపై ఈడీ చర్యలు ఉంటాయా?.. చర్చనీయాంశంగా ఎన్సీపీ బ్యానర్‌!  

2 Aug, 2022 10:04 IST|Sakshi

సాక్షి ముంబై: బీజేపీకి వ్యతిరేకంగా ఔరంగాబాదులో ఎన్సీపీ యూత్‌ కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన బ్యానర్‌ చర్చనీయాంశంగా మారింది. ‘బీజేపీ నాయకులపై ఈడీ, సీబీఐ, ఇన్‌కంటాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ చర్యలు తీసుకుంటుందా? ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారిపై ఇంతవరకు చర్యలు కొనసాగుతున్నాయా? ఒకవేళ చర్యలు కొనసాగుతున్నాయని తెలిస్తే వివరాలు చెప్పండి.. అక్షరాల ఒక లక్ష రూపాయలను గెలుపొందండి’ అంటూ ఔరంగాబాదు ఎన్సీపీ యూత్‌ కార్యదర్శి అక్షయ్‌ పాటిల్‌ బ్యానర్‌ కట్టాడు.

ఈ బ్యానర్‌ సోషల్‌ మీడియాలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అందిన వివరాల మేరకు ఔరంగాబాదు ఎన్సీపీ యూత్‌ కార్యదర్శి అక్షయ్‌ పాటిల్‌ ఈ బ్యానర్‌ను ఔరంగాబాదులోని క్రాంతిచౌక్‌ పరిసరాల్లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌ ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజీపీలో చేరిన వారిపై ఎలాంటి చర్యలుండవని, కేవలం ఈడీ, సీబీఐల పేర్లతో బెదిరించి ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకోవడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని వివరించేందుకే ఈ బ్యానర్‌ ఏర్పాటు చేశానని పాటిల్‌ చెప్పారు. 
చదవండి: సంజయ్‌ రౌత్‌ అరెస్ట్‌.. ఈడీ తరువాత టార్గెట్‌ ఎవరో? 

మరిన్ని వార్తలు