Covid Cases in India: 3 లక్షలకు చేరువలో కరోనా కేసులు

22 Apr, 2021 04:49 IST|Sakshi
భోపాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలోకి ఆక్సిజన్‌ సిలిండర్‌ సహా కరోనా రోగి తరలింపు

ఒక్క రోజులో 2,023 మంది మహమ్మారికి బలి

24 గంటల్లో 2,95,041 కరోనా కేసులు

రికార్డులను తిరగరాస్తున్న భారత్‌

ఒక్క రోజులో అత్యధిక మరణాలు

అత్యధికంగా మహారాష్ట్రలో 519 మంది మృతి

21.5 లక్షలు దాటిన యాక్టివ్‌ కేసుల సంఖ్య

85 శాతానికి చేరిన రికవరీ రేటు

11 రోజుల్లో పాజిటివ్‌ కేసులు రెట్టింపు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రతీరోజు అత్యధిక మరణాల రికార్డును సృష్టిస్తూ, సెకండ్‌ వేవ్‌ మరింత ప్రాణాంతకమని రుజువు చేస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 2,023 మంది కరోనాతో మరణించారు. గత సంవత్సరం కోవిడ్‌–19 అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కరోజులో అత్యధిక మరణాలు మంగళవారం సంభవించాయి. దీంతో కోవిడ్‌ మృతుల సంఖ్య 1,82,570 కు పెరిగింది. మరోవైపు కొత్తగా 2,95,041 మందికి వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. పాజిటివ్‌ కేసుల విషయంలోనూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 1,56,16,130. అదే సమయంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 21,57,538 కు చేరింది. మొత్తం వైరస్‌ సోకిన వారిలో ఇది 13.82 శాతం. దీంతోపాటు కోవిడ్‌ కొత్త కేసుల్లో 76 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని కేంద్రం తెలిపింది.

85 శాతానికి చేరుకున్న రికవరీ రేటు:
గత 11 రోజుల్లో రోజువారీ పాజిటివ్‌ కేసులు రెండింతలు అయ్యాయి. ఏప్రిల్‌ 9వ తేదీన 1.45 లక్షలు ఉన్న పాజిటివ్‌ రోగుల సంఖ్య, 21వ తేదీ నాటికి 2.95 లక్షలకు చేరుకున్నాయి. దీంతో రికవరీ రేటు ఇప్పుడు 85 శాతానికి తగ్గిపోయింది. గణాంకాల ప్రకారం వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,32,76,039కి పెరిగింది. మరోవైపు కరోనా మరణాల రేటు దేశవ్యాప్తంగా 1.2 శాతానికి పడిపోయినప్పటికీ, ఇది మహారాష్ట్రలో 1.5 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 1.6 శాతంగా ఉంది. మరణాలు పెరుగుతుండడంతో చాలా రాష్ట్రాలు పాక్షిక, పూర్తి లాక్డౌన్, నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.

8 రాష్ట్రాల్లోనే 77 శాతం మరణాలు:
దేశంలో కరోనా కారణంగా ఒక్కరోజులో మరణించిన 2,023 మందిలో 77.02% మరణాలు 1,556 మంది ఎనిమిది రాష్ట్రాల్లోనే తుదిశ్వాస విడిచారు. మహారాష్ట్రలో అత్యధికంగా 519 మంది, ఢిల్లీలో 277, ఛత్తీస్‌గఢ్‌లో 191, ఉత్తరప్రదేశ్‌లో 162, గుజరాత్‌ 121, కర్ణాటకలో 149, పంజాబ్‌లో 60, మధ్యప్రదేశ్‌లో 77 మంది మరణించారు. అలాగే ఆరు రాష్ట్రాల్లో 60 శాతం పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో అత్యధికంగా 62,097, ఉత్తర్‌ప్రదేశ్‌లో 29,574, ఢిల్లీలో 28,395, కర్ణాటకలో 21,794, కేరళలో 19,577, ఛత్తీస్‌గఢ్‌లో 15,625 కరోనా పాజిటివ్‌ కొత్త రోగులను గుర్తించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్‌ కేసుల సంఖ్యలో భారత్‌ ముందుంది. ఇటీవల భారీ సంఖ్యలో పెరిగిన పాజి టివ్‌ కేసులతో భారత్‌ అమెరికా తరువాత రెండో స్థానంలో ఉం ది. కరోనాకు సంబంధించిన కొ త్త వేరియంట్ల కారణంగా పాజి టివ్‌ కేసులు పెరుగు తున్నా యని నిపుణులు భావిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు