Neelakurinji flowers: అద్భుత దృశ్యం, రెండు కళ్లూ చాలవు!

19 Aug, 2021 08:06 IST|Sakshi

మందలపట్టి కొండవద్ద విరబూసిన ‘నీలకురింజి’

ఈ పువ్వులు 12 ఏళ్లకు ఒకసారే పూస్తాయి

సాక్షి, బెంగళూరు: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో అద్భుతమైన కమనీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొడగు జిల్లాలోని మందలపట్టి కొండవద్ద నీలకురింజి పువ్వులు విరగబూశాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే ఈ పువ్వులు విరగబూయడంతో నెటిజన్లు సందడి నెలకొంది. అద్భుతం.. రెండు కళ్లూ చాలవంటూ పులకించిపోతున్నారు. 

అరుదైన మొక్కల్లో ఒకటి నీల‌కురింజి. ఇవి ప‌న్నెండేండ్లు పెరిగి పూలు పూసిన త‌ర్వాత చ‌నిపోతాయ‌ట‌. అలా వాటి విత్తనాలతో మొల‌కెత్తిన మొక్కలు మళ్లీ పూతకు  రావాలంటే పుష్కర కాలం వెయిట్‌  చేయాల్సిందే. సాధారణంగా ప్రతీ ఏడాది జూలై-అక్టోబ‌ర్ నెల‌ల కాలంలో ఇవి పూస్తాయి.

ఇకవీటికి  నీలకురింజి అనే పేరు ఎలా వచ్చిందంటే..మ‌ల‌యాళంలో కురింజి అంటే పువ్వు అని, నీల అంటే నీలిరంగు అని అర్థం. ఈ పుష్పాలు నీలం రంగులో ఉండ‌టం వ‌ల్ల  ‘నీల‌కురింజి’  అనే పేరు వ‌చ్చింద‌ట‌.

మరిన్ని వార్తలు