బ్రేకింగ్‌: నీట్‌ పీజీ పరీక్ష వాయిదా

3 May, 2021 15:43 IST|Sakshi

నాలుగు నెలల తర్వత పరీక్ష నిర్వహణ

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ విజృంభిస్తోంది. ప్రతి రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు 10,12 తరగతలు పరీక్షలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ‘‘ నీట్‌ పీజీ పరీక్షను దాదాపు నాలుగు నెలల పాటు వాయిదా వేస్తున్నాం. ఈ ఏడాది ఆగస్ట్‌ 31న పరీక్ష నిర్వహించలేము. ఎగ్జామ్‌ డేట్‌ ప్రకటించిన తర్వాత విద్యార్థులకు ఒక నెల రోజులు వ్యవధి ఇస్తాం. ఆ తర్వత పరీక్ష నిర్వహిస్తాం. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మంది క్వాలిఫైడ్‌ డాక్టర్లు కోవిడ్‌ విధి నిర్వహణలో పాల్గొనే అవకాశం లభిస్తుంది’’ అన్నారు. 

కరోనా కట్టడికి తగినంత మంది వైద్యుల లభ్యత కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కోవిడ్ డ్యూటీ నిర్వహించే వైద్య సిబ్బంది లభ్యత గణనీయంగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. తాజా నిర్ణయం వల్ల పీజీ విద్యార్థుల కొత్త బ్యాచ్‌ ప్రారంభం అయ్యేవరకు చివరి సంవత్సరం పీజీ విద్యార్థుల (విస్తృత మరియు సూపర్-స్పెషాలిటీలు) సేవలను ఉపయోగించుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు అధికారులు.

"ఇంటర్న్‌షిప్ రొటేషన్‌లో భాగంగా కోవిడ్ మేనేజ్‌మెంట్ విధుల్లో మెడికల్ ఇంటర్న్‌లను వారి అధ్యాపకుల పర్యవేక్షణలో మోహరించడానికి అనుమతించాలని నిర్ణయించాము’’ అని తెలిపారు అధికారులు. తాజా నిర్ణయం ఇప్పటికే కోవిడ్‌ విధుల్లో నిమగ్నమైన వైద్యులపై పడుతున్న పని భారాన్ని తగ్గిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. 

చదవండి: ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావట్లేదు

మరిన్ని వార్తలు