‘నీట్‌–యూజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

8 Sep, 2022 08:21 IST|Sakshi

న్యూఢిల్లీ: నీట్‌–అండర్‌ గ్రాడ్యుయేట్‌(యూజీ) మెడికల్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ బుధవారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా 9.93 లక్షల మంది అర్హత సాధించారు. రాజస్తాన్‌కు చెందిన తనిష్క టాప్‌ ర్యాంకు దక్కించుకున్నారు. ఢిల్లీకి చెందిన వత్స ఆశిష్‌ బాత్రా రెండో ర్యాంకు, కర్ణాటకకు చెందిన హృషికేశ్‌ నాగభూషణ్‌ గంగూలీ మూడో ర్యాంకు సాధించారు. ఈ ఏడాది నీట్‌–యూజీ మెడికల్‌ ప్రవేశ పరీక్షకు 17.64 లక్షల మంది హాజరయ్యారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌ నుంచి 1.17 లక్షల మంది, మహారాష్ట్ర నుంచి 1.13 లక్షల మంది, రాజస్తాన్‌  నుంచి 82,548 మంది అర్హత పొందారు.  

నీట్ యూజీ-2022 ఫ‌లితాల కోసం క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు