నీట్‌ ప్రత్యేక రైళ్లు, షాక్‌ తిన్న అధికారులు

14 Sep, 2020 10:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌ పరీక్ష కోసం వేసిన ప్రత్యేక రైలును చూసి డెహ్రాడూన్‌ అధికారులు ఖంగుతిన్నారు. ఆదివారం నీట్‌ పరీక్ష జరగగా కోవిడ్‌ పరిస్థితుల్లో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బంది పడకుండా కేంద్రం వారి కోసం ప్రత్యేకరైళ్లను సిద్దం చేసిన విషయం తెలిసిందే. అయితే పరీక్షకు హాజరుకావడానికి విద్యార్థులకు పరీక్షలు చేయడానికి వచ్చిన రైల్వే సిబ్బందికి మొండి చేయ్యె ఎదురయ్యింది. డెహ్రాడూన్‌లో మొత్తం 18 పరీక్ష సెంటర్‌లు, రూర్కీలో 12 పరీక్ష కేంద్రాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా రైలును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే చాలా తక్కువ మంది ఆ రైలులో ప్రయాణించారు. కేవలం 21 మంది మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రయాణించారు. 

దీని గురించి డెహ్రాడూన్‌ రైల్వే అధికారి మాట్లాడుతూ, ప్రత్యేక రైలును ఎక్కువ మంది విద్యార్థులు వినియోగించుకోలేదు. కోవిడ్‌ కారణంగా జాగ్రత్తగా ఉండటం కోసం వారు తమ సొంత వాహనాలను వినియోగించినట్లు తెలుస్తోంది. పరీక్షల కోసం ప్రత్యేక రైలును నడుపుతున్న రైల్వే శాఖ వీటి కోసం చాలా డబ్బును వెచ్చించింది. అయితే కేవలం రూ. 1040 మాత్రమే ఈ రైళ్ల ద్వారా ప్రభుత్వానికి లభించాయి.  

చదవండి: నీట్‌పై వ్యాఖ్యలు : చిక్కుల్లో హీరో సూర

మరిన్ని వార్తలు