దేశవ్యాప్తంగా 499 కేంద్రాల్లో నీట్‌.. పరీక్షకు 20 లక్షల మంది విద్యార్థులు

7 May, 2023 14:30 IST|Sakshi

న్యూఢిల్లీ/హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా నీట్ యూజీ ప్రారంభమైంది. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం 20 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో నీట్ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 వరకు పరీక్ష జరగనుంది.

కాగా.. పరీక్షకు హాజరయ్యేవారికి కఠిన నిబంధనల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆభరణాలు, మెటల్‌తో తయారైన ఎలాంటి వాటిని కూడా ఎగ్జామ్ హల్‌లోకి అనుమతించడం లేదు. వాటన్నింటిని తొలగించిన తర్వాతే హాల్‌లోకి అనుమతిస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ చెవిదుద్దులు, ముక్కుపుడకలు, నెక్లెస్, చైన్, ఉంగరాలు ఇతర వస్తువులను బయటే తమ వాళ్లకు అప్పగించి వెళ్తున్నారు.

విద్యార్థికి నో ఎంట్రీ..
హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలోని పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థి ఐదు నిమిషాలు అలస్యంగా వెళ్లగా.. సిబ్బంది ఎగ్జామ్‌ హాల్‌లోకి అనుమతించలేదు. దీంతో పరీక్షకు హాజరుకాలేకపోయాడు.

మరోవైపు మణిపూర్‌లో ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేశారు. అయితే విద్యార్థులు మాత్రం పరీక్ష సమయానికి ఎగ్జామ్ సెంటర్‌కు వచ్చి రిపోర్ట్ చేయాలని అధికారులు తెలిపారు.  వీరందరికి మరో రోజు పరీక్ష నిర్వహించనున్నారు.
చదవండి: పని చేసే శక్తి మనదే, సంపాదించే సత్తా మనదే, ఏడేళ్లలో ఊహించని వృద్ధి

మరిన్ని వార్తలు