ఢిల్లీలో భూకంపం.. నేపాల్‌లో తీవ్ర ప్రకంపనలు.. ఆరుగురి మృతి

9 Nov, 2022 08:56 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో భూమి కంపించింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పలు చోట్ల 20 సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి. ఆ ప్రభావంతో  ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టరు స్కేలుపై 1.6 తీవ్రత నమోదైంది. మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లోనూ ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు తెలుస్తోంది. ఇక పొరుగు దేశం నేపాల్‌లో బుధవారం ఉదయం 12 గంటల సమయంలో భారీ  భూకంపం సంభవించింది. స్వల్ఫ వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 6.3 తీవ్రత నమోదైంది.

భారీ భూప్రకంపనల ధాటికి నేపాల్‌ దోతి జిల్లాలో ఓ ఇల్లు కూలి ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ భూవిజ్ఞాన కేంద్రం అధికారులు వెల్లడించారు. నేపాల్‌లో మంగళవారం 4.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. 24 గంటల్లోనే రెండోసారి మరో భూకంపం రావడం ఆందోళన కల్గిస్తోంది.

నేపాల్‌ ఆర్మీ రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టింది. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

చదవండి: ‘నోట్ల రద్దు’కు ఆరేళ్లు.. సుప్రీంకోర్టులో విచారణ

మరిన్ని వార్తలు