నేపాల్‌: తదుపరి ప్రధాని షేర్‌ బహదూర్‌ దుబా? 

13 May, 2021 08:18 IST|Sakshi

ఖాట్మండూ: ఓలి ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసే దిశగా నేపాలీ కాంగ్రెస్‌ పార్టీ మంతనాలు జరుపుతోంది. దీనికోసం మంగళవారం నేపాలీ కాంగ్రెస్‌ ఆఫీస్‌ బేరర్లు భేటీ అయ్యారు. గురువారంలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని దేశాధ్యక్షుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్‌సీ అధ్యక్షుడు షేర్‌బహదూర్‌ దుబాను ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దీనికి పుష్ప కమల్‌ ప్రంచండ నేతృత్వంలోని సీపీఎన్‌ మావోయిస్టు సెంటర్‌ మద్దతు తెలపగా, సమాజ్‌వాదీ పార్టీలో ఓ వర్గం వ్యతిరేకించింది. గతంలో ప్రధానిగా చేయని కొత్త వ్యక్తిని ప్రధానిగా చేయాలని ఆ వర్గం పట్టుబడుతోంది. ఈ మూడు పార్టీల్లో దేనికీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సందిగ్దత కొనసాగుతోంది.

ఒకవేళ ఈ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే నేపాల్‌ రాజ్యాంగం ప్రకారం.. అతిపెద్ద పార్టీకి చెందిన నాయకున్ని మైనారిటీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సి ఉంటుంది. ఆయన 30 రోజుల్లోగా తన మెజారిటీని నిరూపించుకోవాలి. అదే జరిగితే ఓలి తిరిగి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది.

(చదవండి: KP Sharma Oli: విశ్వాస పరీక్షలో ఓడిన ఓలి)

(చదవండి: సీఎం అవుతానని 30 ఏళ్ల క్రితమే చెప్పాడు : సీఎం భార్య)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు