ప్రేమకు భాషలేదు.. రీట్వీట్ల హోరు!

16 Oct, 2021 07:38 IST|Sakshi

మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే ఒక ఆకాంక్షే ప్రేమ. మరొకరిని మీలో భాగంగా ఇముడ్చుకోవాలనే కోరిక వ్యక్తమైనప్పుడు మనం దానినే ప్రేమ అని పిలుస్తూ ఉంటాం. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త ప్రాణులు తమ ప్రేమను పంచడం అనేది ఒకేలా ఉంటుంది. మనం ఆపదలో సాయం చేస్తే ఆ ప్రేమ మరింత రెట్టింపు అవుతుందనడానికి తాజాగా ఘటనే అద్దంపడుతోంది. తనను కాపాడిన ఒక పోలీస్‌ అధికారిని ఒక పిల్ల ఏనుగు ఆప్యాయంగా నిమురుతూ ఎలా పరవశించిపోతుందో చూడండి. 

తమిళనాడులోని అటవీ శాఖ అధికారులు.. గాయపడిన ఒక పిల్ల ఏనుగును కాపాడి తల్లి ఏనుగు వద్దకు చేర్చారు.  కాగా, పిల్ల ఏనుగును తీసుకువెళుతున్న క్రమంలో అది పోలీస్‌ అధికారి వెనకవైపు తడుముతూ తన ప్రేమను వ్యక్తీకరించింది. దీనికి సంబంధించిన ఫోటోను అటవీ శాఖ అధికారి ప్రవీణ్‌ కశ్వన్‌ తన ట్వీటర్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేశారు. ఈ పిక్చర్‌ను షేర్‌ చేసిన రోజు వ్యవధిలోనే వేల సంఖ్యలో లైక్స్‌, వెయ్యికిపైగా రీట్వీట్లతో హోరెత్తింది. ఒక వైపు అటవీ శాఖ అధికారుల్ని ప్రశంసలతో ముంచెత్తుతూనే ‘ప్రేమకు భాష లేదు’ అని అనడానికి ఇదొక ఉదాహరణ అని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. ఇది ఫోటో ఆఫ్‌ ది ఇయర్‌గా నిలుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 

మరిన్ని వార్తలు