కోవిడ్‌: 2 నెలల తర్వాత తొలిసారి వెయ్యిలోపు మరణాలు

28 Jun, 2021 09:55 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో 46,148 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో 979 మంది మృతిచెందారు. సుమారు రెండున్నర నెలల(ఏప్రిల్‌13) తర్వాత తొలిసారి 1000లోపు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం రోజు 58,578 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ సోమవారం కోవిడ్‌పై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదయిన పాజిటివ్ కేసుల సంఖ్య 3,02,79,331గా ఉంది. మొత్తం 3,96,739 మంది మరణించారు. ప్రస్తుతం 5,72,994 యాక్టీవ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,93,09,607కి చేరింది.  దేశంలో 96.80 శాతం కరోనా రికవరీ రేటు ఉంది. యాక్టివ్ కేసుల శాతం 1.89 శాతం, మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.
చదవండి: కరోనా తగ్గినా.. ఈ సమస్యలు 3 నెలలు దాటినా వదలట్లేదు 

మరిన్ని వార్తలు