ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్‌ఎస్

20 Dec, 2021 20:59 IST|Sakshi

న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారయ్యిన సంగతి తెలిసిందే. ఐతే చిన్నారుల మృతికి హానికరమైన దగ్గు మందే కారణమని విచారణలో తేలింది. డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే చిన్నారులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) సోమవారం వెల్లడించింది. 

నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారికి డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను అందించారు. ఐతే ఈ దగ్గుమందు కారణంగా ముగ్గురు పిల్లలు మృతి చెందగా, మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో సహా వివిధ డిస్పెన్సరీలలో పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న డెక్స్‌ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే మరణాలు సంభవించాయని డీజీహెచ్‌ఎస్ పేర్కొంది. ‘మా పరిశోధనలో అది హానికరమైన దగ్గు మందని తేలింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందు ఇవ్వకూడదని, మొహల్లా క్లినిక్‌లు, డిస్పెన్సరీలలో పంపిణీ చేస్తున్న ఈ మందును వెంటనే సీజ్‌ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని డీజీహెచ్‌ఎస్ ఆదేశించింది.

చదవండి: Crying Child Playing The Violin: ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా?

మరిన్ని వార్తలు