నేషనల్‌ హెరాల్డ్‌ కేసు: మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్‌..

15 Jun, 2022 12:21 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ విచారణ మూడో రోజుకు చేరుకుంది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ రాహుల్‌పై ప్రశ్నల పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వరుసగా మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. గడిచిన 2 రోజుల్లో 21 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది.
చదవండి: నేషనల్‌ హెరాల్డ్‌ కేసేంటి?.. ఈ ప్రశ్నలకు బదులేది?

తొలిరోజు 10 గంటల పాటు, రెండో రోజు 11 గంటల పాటు విచారణ జరిపిన ఈడీ.. ఇప్పటికే ఈ కేసులో పలు కీలక విషయాలకు సంబంధించిన ప్రశ్నలను విచారణలో అడిగినట్లు సమాచారం. పీఎంఎల్ఏ సెక్షన్ 50 కింద రాహుల్ గాంధీని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరో వైపు దేశవ్యాప్తంగా రాహుల్‌ విచారణపై కాంగ్రస్‌ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.

చదవండి: మళ్లీ కరోనా టెన్షన్‌.. ఒక్క రోజులో 33 శాతం అధికంగా కేసులు నమోదు!

మరిన్ని వార్తలు