ఇంగ్లీష్‌ ట్వీట్లలో పరమ తప్పులు! తెరపైకి తెచ్చి మరీ..

8 Jul, 2021 13:55 IST|Sakshi

ఈరోజుల్లో చదువుతో సంబంధం ఏముందిలే అని చాలామంది అనుకోవచ్చు. కానీ, ఆ అర్హతనే ఆధారంగా చేసుకుని విమర్శిస్తున్న రోజులివి. ముఖ్యంగా రాజకీయాల్లో నేతల ఎడ్యుకేషన్‌ ఎప్పుడూ హాట్‌ టాపిక్‌గానే మారుతుంటుంది. అలాంటిది.. 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆఫీస్‌లో అడుగుపెట్టిన మన్షుక్‌ ల‌క్ష్మణ్ మాండవీయకు ట్రోల్స్‌ ఆహ్వానం పలుకుతున్నాయి. అందుకు కారణం.. ఆంగ్ల భాషలో ఆయన పరిజ్ఞానం చర్చకు రావడమే. గతంలో ఆయన చేసిన కొన్ని ట్వీట్లలో ఆంగ్లపు అక్షర దోషాలు ఉన్నాయి. మామూలుగా ఒకటి రెండు స్పెల్లింగ్‌ మిస్టేక్‌లు ఉంటే ఫర్వాలేదు. కానీ, ఏకంగా అర్థం మారిపోయేట్లుగా ఉండడం, కొన్ని చోట్ల స్పెల్లింగ్‌లు దారుణంగా ఉన్నాయి.

ఇక అందుకు సంబంధించి స్రీ‍్కన్‌ షాట్స్‌ కొన్ని నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. వాటిలో ఎంత వరకు ఫేక్‌ ఉన్నాయో తెలియదు కానీ.. ఒకటి రెండు మాత్రం ఆయన ఒరిజినల్‌ అకౌంట్‌కు చెందినవే కావడంతో.. మొత్తం నిజమై ఉంటాయని భావిస్తున్నారు. మరికొన్ని డిలీట్‌ అయి ఉన్నాయి. ఇక గుజరాత్‌కు చెందిన మన్షుక్‌ మాండవీయ.. ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ పూర్తి చేసినట్లు ఆయన ప్రొఫైల్‌లో ఉంది. మరోవైపు బీజేపీ నేతలు, అభిమానులు మాత్రం మంత్రికి సపోర్ట్‌గా రీట్వీట్లు చేస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు