మరో అందమైన మగ తోడు కనిపిస్తే భర్తకు విడాకులే..

4 Dec, 2021 19:36 IST|Sakshi

మనుషుల మాదిరే పక్షులు కూడా విడాకులు తీసుకుంటాయట

ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఏఎంయూ ప్రొఫెసర్‌

న్యూఢిల్లీ: మనిషి జీవితంలో వివాహానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. జీవితంలో ఏదో ఒక దశలో తోడు అవసరం అవుతుంది. ఇది గమనించే మనకు పెళ్లి, పిల్లలు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు పెద్దలు. అయితే దురదృష్టం కొద్ది విడాకులు అనే సౌలభ్యాన్ని కూడా ఏర్చర్చుకున్నాడు మనిషి. విడాకులు అనేది ఇద్దరు వ్యక్తులనే కాక.. రెండు కుటుంబాలను తీవ్రంగా బాధపెడుతుంది. అయితే దంపతులు విడిపోవాలనుకోవడానికి ప్రధాన కారణం.. వారి మధ్య మూడో వ్యక్తి ప్రవేశించడం. పిల్లలు ఎదుగుతున్న సమయంలో దంపతులు విడాకులు తీసుకుంటే అది పిల్లల భవిష్యత్‌పై చాలా తీవ్ర పరిణామాలు చూపిస్తుంది. 

ఇప్పుడు ఈ విడాకులు ముచ్చట ఎందుకంటే మనుషుల మాదిరే పక్షుల్లో కూడా విడాకులు సంప్రదాయం ఉందట. జంట పక్షి నచ్చకపోయినా.. వేరే పక్షి అందంగా కనిపించినా.. వెంటనే భాగస్వామికి విడాకులు ఇచ్చేస్తాయట. అలానే తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు భావించినప్పుడు కూడా విడాకులు తీసుకుంటాయట. ఈ విషయాలను ఓ ప్రముఖ పరిశోధకుడు తెలిపారు. 

(చదవండి: విడాకులపై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు, కాసేపటికే ట్వీట్‌ డిలీట్‌)

కొన్ని సంవత్సరాల క్రితం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ)లోని వన్యప్రాణి విభాగానికి చెందిన ప్రొఫెసర్ హెచ్‌ఎస్‌ఎ యాహ్యా ఉర్దూలో ఒక పుస్తకాన్ని రాశారు. గార్డ్-ఓ-పెష్ అనే తన 11వ పుస్తకంలో, పక్షుల మధ్య సంబంధాల గురించి పరిశోధనా వాస్తవాలను ముందుకు తెచ్చాడు. దీని వెనుక ఆయన 4 దశాబ్దాల పరిశోధన ఉంది.

ప్రొఫెసర్ యాహ్యా 40 ఏళ్లకు పైగా పక్షులపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పుస్తకంలో, ఆయన చాలా అసాధారణమైన వాస్తవాలను వెల్లడించారు. ప్రొ.యాహ్యా తన పరిశోధనల కోసం కాలిఫోర్నియా, స్కాట్లాండ్, సౌదీ అరేబియా తదితర అనేక దేశాలను సందర్శించారు. ముఖ్యంగా వార్‌బెట్ జాతుల పక్షులు, నార్కోండమ్ హార్న్ బిల్, ఖర్మోర్, తెల్ల రెక్కల బాతు మొదలైన వాటిపై ఆయన విస్తృత పరిశోధనలు చేశారు.
(చదవండి: టెక్కీ దంపతులు.. 3 నెలలకే విడాకుల వరకు, ఎందుకిలా జరుగుతోంది?)

ఈ పరిశోధనల అనంతరం ఆయన గుర్తించింది ఏంటంటే పక్షులు కూడా విడాకులు ఇస్తాయట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, బయా పక్షులు అత్యధిక జంటలను ఏర్పరుస్తాయి. మగ పక్షి గూడు నిర్మాణం ప్రారంభించి.. అసంపూర్ణంగా వదిలివేస్తుంది. మిగిలిన గూడును జంటగా మారిన తర్వాత, మగ, ఆడ రెండూ కలిసి పూర్తి చేస్తాయి. రెండు కలిసి ఆ గూట్లో నివసిస్తాయి. 
(చదవండి: ఈ చెట్టు పిట్టలని చంపుతుంది.. కారణం తెలుసా!?)

ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఆడ బయా పక్షికి.. తన సహచరుడి కంటే మెరుగైన మగతోడు దొరికినప్పుడు.. మొదటిదానిని వదిలి.. కొత్తగా దొరికిన తోడుతో వెళ్లిపోతుందట. ప్రొఫెసర్ యాహ్యా పరిశోధన ప్రకారం, పాలియాండ్రీ, అమెరికన్ మాకింగ్ బర్డ్స్ అనే జాతుల పక్షుల్లో ఆడ పక్షి.. ఒకదాని కంటే ఎక్కువ మగ పక్షులతో సంబంధం కలిగి ఉంటుందని తెలిపారు. బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ జాతుల పక్షులు కూడా ఇలానే ప్రవర్తిస్తాయట. ఒకటి కంటే ఎక్కువ మంది భాగస్వాములతో సంబంధాల కారణంగా స్త్రీ, పురుషుల మధ్య విడాకులు ఎలా సంభవిస్తాయో.. పక్షుల్లో కూడా ఇదే కారణంగా విడాకులు సంభవిస్తాయని ప్రొఫెసర్‌ యాహ్య తెలిపారు. 
(చదవండి: 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్‌సిరీస్‌ తర్వాత సమంత ఆ నిర్ణయం తీసుకుంది)

అలానే పక్షులు తప్పుడు భాగస్వామిని ఎన్నుకున్నట్లు గ్రహించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడాకులు తీసుకుంటాయట. ఆడ పక్షికి.. మరో మగ పక్షి మరితం ఆకర్షణీయంగా కనిపిస్తే.. తన పాత భాగస్వామిని వదిలివేస్తుందట. అదే సమయంలో, భాగస్వామి ప్రమాదంలో గాయపడితే విడాకులు తీసుకుంటాయట. పక్షులు బలహీనమైన సహచరులను ఇష్టపడరట. మనుషుల్లాగే అవి కూడా తమ జీవితానికి భద్రతను కోరుకుంటాయట. 

చదవండి: మాస్క్‌లు లేవు.. భౌతిక దూరం బాధే లేదు...

మరిన్ని వార్తలు