వాట్సాప్‌లో మరో కొత్త స్కామ్ జర జాగ్రత్త!

17 Mar, 2021 15:48 IST|Sakshi

వాట్సాప్‌లో వచ్చే లింకుల విషయంలో జర జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఉంది. గత కొద్దీ రోజుల నుంచి ఒక నకిలీ లింక్ తెగ వైరల్ అవుతుంది. ఈ ఆన్‌లైన్ సర్వేలో పాల్గొనడం ద్వారా మీరు ఐఫోన్ 12 ప్రోను గెలుచుకునే అవకాశాన్ని అందిస్తున్నట్లు దాని ముఖ్య సారాంశం. కానీ, ఇది నిజం కాదు. 'డీహెచ్‌ఎల్ సర్వే' ముసుగులో వాట్సాప్‌లో ఈ ఆన్‌లైన్ లింక్ తెగ వైరల్ అవుతుంది. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేందుకు స్కామర్లు ఉపయోగించే ఫిషింగ్ లేదా స్కామ్ లింక్ టెక్నిక్ అని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు. 

మీరు లింక్‌పై క్లిక్ చేసినప్పుడు దీనిలో లింగం, వయస్సు, మొబైల్ ఫోన్ రకం(ఆండ్రాయిడ్ లేదా ఆపిల్ ) వంటి వివరాలను సేకరిస్తున్నారు. అలాగే డీహెచ్‌ఎల్ సేవలపై రేటింగ్ ఇవ్వమని అడుగుతున్నారు. తర్వాత బహుమతి కోసం కొన్ని బహుమతి బాక్స్ లు ఎన్నుకోవాలి. దాని తర్వాత వ్యక్తి ఐఫోన్‌ను గెలుస్తాడు. దీని యొక్క మొత్తం ప్రక్రియ ఇది. అలాగే, ఐఫోన్ గెలవడానికి వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ను మరో ఐదు గ్రూపులకు లేదా 20 మంది వ్యక్తులకు పంచుకోవాలనే షరతు కూడా ఉంటుంది. ఈ లింక్‌లపై క్లిక్ చేస్తే ప్రమాద భారీన పడే అవకాశం ఉన్నట్లు ఎన్‌జిఎన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఖేమ్లాల్ ఛెత్రి తెలిపారు. 

మీ వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ వివరాలను దొంగిలించడానికి స్కామర్లు ఈ లింక్‌లను పంపుతారని ఆయన అన్నారు. "వారు బ్యాంక్ వివరాలను దొంగిలించినట్లయితే మీ బ్యాంక్ నుంచి డబ్బును బదిలీ చేయడానికి ప్రయత్నిస్తారు" అని ఖేమ్లాల్ ఛెత్రి అన్నారు. మోసగాళ్లు సమాచారాన్ని దొంగిలించడానికి లేదా ఎలక్ట్రానిక్ పరికరాలను హ్యాక్ చేయడానికి మాల్వేర్ల గల లింకులు పంపుతారని ఖేమ్లాల్ ఛెత్రి చెప్పారు. అయితే, లింకు క్లిక్ చేసి ఇదివరకే కొంత ప్రాథమిక సమాచారం ఇస్తే సమస్య ఏమి లేదు కాని బ్యాంక్ వివరాలు లేదా పాస్‌వర్డ్‌లు వంటి క్లిష్టమైన సమాచారాన్ని పంచుకుంటే మాత్రం మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశం ఎక్కువ. 

భూటాన్ కంప్యూటర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీం (బిటిసిఐఆర్టి), సమాచార మరియు సమాచార మంత్రిత్వ శాఖ(ఎంఐసి) ఆధ్వర్యంలోని జాతీయ కంప్యూటర్ బృందం తమ ఫేస్ బుక్ పేజీలో కూడా ఇటువంటి లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. ప్రజలు ఎల్లప్పుడూ URLను తనిఖీ చేయాలని మరియు ఈ ప్రత్యేక సందర్భంలో లింక్ డీహెచ్‌ఎల్ నుంచి ఉంటే దానికి లింక్ www.dhl.com ఉండాలి అని నిపుణులు తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు