మూడు వారాల కింద పెళ్లి.. పాలల్లో మత్తు మందు కలిపి

27 May, 2021 20:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: పెళ్లి జరిగిన మూడు వారాలకు కట్టుకున్న భర్తకు, అత్తింటివారికి మత్తు మందు ఇచ్చిన కొత్త కోడలు పట్టుచీరలు, నగలతో పరారైంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాహ్ సిటీలో గురువారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాలు.. బాహ్ సిటీకి చెందిన ఉపేంద్ర (22)కు ఈ నెల 7న శాలిని (20)తో వివాహం జ‌రిగింది.  పెళ్లి జరిగిన మూడు వారాల పాటు శాలిని తన భర్త, అత్తింటి వారితో బాగానే క‌లిసిపోయినట్లు నటించింది.

కాగా సోమవారం రాత్రి భ‌ర్త‌కు, అత్త‌మామ‌ల‌కు పాల‌ల్లో మ‌త్తు మందు క‌లిపి ఇచ్చింది. వాళ్లు ఆ పాలు తాగి మ‌త్తులోకి జారుకోగానే ఇంట్లో విలువైన న‌గ‌లు, బ‌ట్ట‌లు తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోయింది. కాగా  ఉద‌యం నిద్ర లేచి చూసేసరికి శాలిని ఇంట్లో కనిపించలేదు.దీంతో  ఉపేంద్ర‌, అత‌ని తల్లిదండ్రులు ఇళ్లుతో పాటు చట్టుపక్కల వెతికినా ఆమె జాడ తెలియ‌లేదు. అనుమానం వ‌చ్చి ఇంట్లోని బీరువా తీసి చూడ‌గా అందులోని విలువైన న‌గ‌లు, చీరలు మాయ‌మ‌య్యాయి. దాంతో కొత్త కోడ‌లే ఈ పని చేసిందని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: భర్త ఫోన్‌పై భార్య నిఘా.. నష్టపరిహారం చెల్లించమన్న కోర్టు


 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు