ఏనుగుతో ఫోటోకు కొత్త జంట పోజు.. చిర్రెత్తి కుమ్మిపడేసిందిగా!

1 Dec, 2022 15:20 IST|Sakshi

తిరువనంతపురం: ఆలయానికి వెళ్లిన ఓ కొత్త జంటకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోని గజరాజు ముందు ఫోటోలు దిగాలనుకున్నారు. కానీ, ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆ ఏనుగు దాడి చేసింది. ఈ వీడియోను ఓ ఫోటోగ్రాఫర్‌ ‘వెడ్డింగ్‌ మొజిటో’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా.. వైరల్‌గా మారింది. ఈ సంఘటన కేరళ త్రిస్సూర్‌లోని గురువాయుర్‌ ఆలయంలో నవంబర్‌ 10న జరిగింది. గజరాజు ఒక్కసారిగా దాడి చేయడంతో సమీపంలోని భక్తులంతా పరుగులు పెట్టాల్సి వచ్చింది. 

వీడియో ప్రకారం.. కొత్త జంట మెడలో మాలలతో ఏనుగు సమీపంలోకి వెళ్లి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. వారికి గజరాజు కుడివైపున ఉంది. ఫోటోగ్రాఫర్‌ కెమెరాను క్లిక్‌ మనిపించగా.. ఆగ్రహానికి గురైన ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. మావటి అదుపు చేసేందుకు ప్రయత్నించగా ఎత్తి కుమ్మిపడేసింది. తొండంతో పైకెత్తేందుకు ప్రయత్నించగా కింద పడిపోయాడు. ఆ వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకున్నాడు. అయితే, అతని శరీరంపై ఉన్న బట్టలను ఏనుగు లాగేసింది. ఆ తర్వాత ఏనుగుపై ఉన్న మరో మావటి దానిని అదుపు చేశాడు. తమకు ఎదురైన ఈ సంఘటనను వీడియోలో వివరించాడు పెళ్లి కొడుకు. తాము ఫోటోలు దిగుతుండగా అంతా అరుస్తూ పరుగెడుతున్నారని, తన భార్య చేతిని పట్టుకుని లాక్కెళ్లినట్లు చెప్పాడు.

A post shared by Wedding Mojito (@weddingmojito)

ఇదీ చదవండి: Video: లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ముగ్గురు చిన్నారులు.. భయంతో కేకలు, ఏడుపు

మరిన్ని వార్తలు