మాంసాహార ప్రియులు పెరుగుతున్నారట!.. ముక్క లేనిదే ముద్ద దిగదే!

17 Jun, 2022 12:12 IST|Sakshi

దేశంలో పెరుగుతున్న మాంసాహార ప్రియులు

మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ పెరుగుదల

పురుషుల్లో 5 శాతం, మహిళల్లో 0.6 శాతం పెరిగిన నాన్‌ వెజిటేరియన్స్‌

కనీసం వారానికి ఒకసారి చేపలు, చికెన్, మటన్‌

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో ముక్క లేకుండా ముద్ద దిగని వారి సంఖ్య పెరుగుతోంది. అధిక శాతం ప్రజలు వారానికి కనీసం ఒకసారి చేపలు, చికెన్, మాంసంలో ఏదో ఒక దానిని కచ్చితంగా ఆరగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)–5 వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ, పురుషుల నుంచి ఈ వివరాలు సేకరించారు.

ఆ సర్వే ప్రకారం దేశంలో శాకాహారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. శాకాహార పురుషుల సంఖ్య 21.6 శాతం నుంచి 16.6 శాతానికి పడిపోయింది. అంటే మాంసాహారులు 5 శాతం పెరిగారు. మహిళల్లో మాంసాహారుల సంఖ్య స్వల్పంగా 0.6 శాతమే పెరిగింది. మాంసాహారాన్ని వ్యతిరేకించే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లోనూ మాంసాహార ప్రియులు స్వల్పంగా పెరిగారు.

ఇక్కడే అధికం..
పురుషుల్లో మాంసాహారం తినేవారిలో లక్షద్వీప్‌లో అత్యధికంగా 98.4 శాతం ఉన్నారు. రాజస్తాన్‌లో అత్యల్పంగా 14.1 శాతం ఉన్నారు. లక్షద్వీప్‌ తర్వాత అండమాన్‌ – నికోబార్‌ దీవుల్లో 96.1శాతం, గోవా 93.8 శాతం, కేరళ 90.1శాతం, పుదుచ్చేరి 89.9శాతం మాంసాహారులు ఉన్నారు. ఇక్కడ వారానికోసారి మాంసం తినేవారి నిష్పత్తి కూడా బాగా పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన మహిళా మాంసాహారులు
ఆంధ్రప్రదేశ్‌లో 97.4 శాతం మంది పురుషులు, 95 శాతం మంది మహిళలు మంసాహారాన్ని ఇష్టపడుతున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య çపురుషుల్లో స్వల్పంగా, మహిళల్లో బాగా పెరిగింది. 2015–16లో 78.2 శాతం మంది పురుషులు మాంసాహారం తీసుకుంటే 2019–21 నాటికి 80 శాతానికి చేరుకుంది. అదే మహిళల్లో 71.2 శాతం నుంచి 83.6 శాతానికి పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో పురుషుల్లో 74.6 శాతం నుంచి 73.8 శాతానికి తగ్గితే.. మహిళల్లో మాత్రం 57.7 శాతం నుంచి 72.4 శాతానికి అనూహ్యంగా పెరిగినట్లు సర్వే వెల్లడించింది.
చదవండి: అగ్నిపథ్‌ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తం

మరిన్ని వార్తలు