Harpreet Singh: వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ అరెస్ట్‌

2 Dec, 2022 10:50 IST|Sakshi

సాక్షి న్యూఢిల్లీ: వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ హర్‌ప్రీత్‌ సింగ్‌ను ఎన్‌ఐఏ శుక్రవారం అరెస్ట్‌ చేసింది. లూథియానా కోర్టు పేలుడు కేసులో ప్రధాన కుట్రదారుడైన హర్‌ప్రీత్‌ను న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన హర్‌ప్రీత్‌.. ఘటన అనంతరం మలేషియాకు చెక్కేశాడు. తాజాగా భారత్‌కు రాగా పక్కా సమాచారంతో కాపుగాసిన ఎన్‌ఐఏ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే అతనిపై రూ.10 లక్షల రివార్డును ఎన్‌ఐఏ ప్రకటించింది.

కాగా, 2021 డిసెంబర్ 23 న లూథియానా కోర్టులో బాంబు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌కు చెందిన సెల్ఫ్-స్టైల్ సంస్థ ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) చీఫ్ లఖ్‌బీర్ సింగ్ రోడ్ సహచరుడు హర్‌ప్రీత్‌ సింగ్ లూథియానా కోర్ట్ బిల్డింగ్ పేలుడు కుట్రదారుల్లో ఒకడని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. అరెస్టయిన నిందితుడికి పేలుడు పదార్థాలు, ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌తో పాటు పలు కేసుల్లో కూడా ప్రమేయం ఉందని ఎన్‌ఐఏ అధికారులు పేర్కొన్నారు.
చదవండి: మీరే రూల్స్‌ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్‌ పీకిన మహిళ

మరిన్ని వార్తలు