సచిన్ వాజే కేసులో మరో కొత్త కోణం

14 Apr, 2021 16:04 IST|Sakshi

ముంబై: పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ బెదిరింపుల కేసులో మరో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండైన పోలీస్‌ అధికారి సచిన్‌ వాజే మరో ఇద్దరిని హతమార్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అయిన వాజ్ వారిని చంపి ఈ కేసును పరిష్కరించినట్లు చెప్పుకోవాలనుకున్నాడు. కాని ఆ ప్లాన్ పనిచేయకపోవడంతో మరో ప్లాన్ అమలు చేసి పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ముఖేష్ అంబానీ ఇంటి ముందు నిలిపారు.
 
ఈ కేసుపై దర్యాప్తు జరుగుతున్నా సమయంలో థానేలో ఉన్న వాజ్ ఇంటిని పరిశోధిస్తున్నప్పుడు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) బృందానికి ఒక వ్యక్తి పాస్ పోర్ట్ లభించింది. పాస్ పోర్ట్ హోల్డర్, మరో వ్యక్తిని "నకిలీ ఎన్కౌంటర్"లో చంపడానికి వాజ్ ప్రణాళిక వేసినట్లు ఎన్‌ఐఏ బృందం అనుమానిస్తోంది. గత ఏడాది నవంబర్‌లో వారిద్దరి సహాయంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరం నుంచి దొంగిలించబడిన మారుతి ఈకో వాహనంలో పేలుడు పదార్థాలను అమర్చి అంబానీ ఇంటి ముందు నిలిపి, తర్వాత వారు దోషులను నిర్దారింఛి "ఫేక్ ఎన్‌కౌంటర్" చేయాలనీ మొదట ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ పేర్కొంది.

ఇలా పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీ కేసును పరిష్కరించి తానే ప్రశంసలు పొందాలని వాజ్ ప్లాన్ చేసినట్లు దర్యాప్తు సంస్థ అనుమానిస్తుంది. అలాగే కొంత మొత్తం డబ్బులు కూడా డిమాండ్ చేయాలనీ చూసినట్లు సమాచారం. అయితే, ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చలేదని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏజెన్సీలలో జరిగిన "నకిలీ ఎన్ కౌంటర్" విషయాలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీ ఫిబ్రవరి 25న ముఖేష్  అంబానీ దక్షిణ ముంబై నివాసం వెలుపల ఆపి ఉంచినట్లు కనుగొనబడింది. ఎస్‌యూవీని స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ వాహన యజమాని వ్యాపారవేత్త మన్సుఖ్ హిరాన్ మార్చి 5న థానేలోని అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. మార్చి 13న ఎన్‌ఐఏ సచిన్‌ వాజ్‌ను అరెస్టు చేసింది.

చదవండి: సచిన్‌వాజే  హైఎండ్‌ బైక్‌ స్వాధీనం 

>
మరిన్ని వార్తలు