మాజీ ఎమ్మెల్యే కుమారుడికి ఐసిస్‌తో లింక్‌?

5 Aug, 2021 03:59 IST|Sakshi

మంగళూరులో ఎన్‌ఐఏ సోదాలు

సాక్షి, బనశంకరి: సిరియాలోని ఐసిస్‌ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో మాజీ ఎమ్మెల్యే బీఎం ఇదినబ్బ కుమారుడి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మంగళూరులోని మస్తికట్టెలో ఉన్న బీఎం బాషా నివాసంపై బుధవారం ఎన్‌ఐఏ ఐజీపీ ఉమా నేతృత్వంలో 25 మంది బృందం దాడి చేసింది. స్థానిక పోలీసులతో కలిసి సోదాలతో పాటు విచారణ ప్రారంభించారు.

బాషా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుండగా, అతని ఇద్దరు కుమారులు విదేశాల్లో స్థిరపడ్డారు. అతడి కుమార్తె కొన్నేళ్ల క్రితం కేరళ నుంచి అదృశ్యమైంది. ఆమె సిరియాలో ఐసిస్‌లో చేరినట్లు అనుమానాలున్నాయి. బాషా కుటుంబసభ్యులు ఐసిస్‌ నిర్వహించే యుట్యూట్‌ చానల్‌ను సబ్‌స్క్రైబ్‌ చేసినట్లు తెలి సింది. దీంతో ఇస్లామిక్‌ స్టేట్‌తో సంబంధాలు ఉన్నాయనే అనుమానం వ్యక్తమైంది.

అంతేగాక జమ్మూకశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న యువకులతో బాషా కుటుంబీకులు ఫోన్లో సంభా షించినట్లు ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. ఉళ్లాల నియోజకవర్గంలో మూడుసార్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న బీఎం.ఇదినబ్బ పాత్రికేయుడు, స్వాతం త్య్ర సమరయోధుడు, కన్నడ సాహితీవేత్త, కన్నడ ఉద్యమకారునిగా పేరుగాంచారు. ఆయన 2009లో కన్నుమూశారు. ఆయన కుమారుడు బాషా ఉగ్రవాద ఆరోపణల్లో చిక్కుకోవడం గమనార్హం.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు