Bomb Blast : ఢిల్లీ పేలుళ్ల వెనుక ఉన్నది వీళ్లే ?

15 Jun, 2021 18:55 IST|Sakshi

అనుమానితుల వీడియో రిలీజ్‌ చేసిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ : ఈ ఏడాది జనవరి 29న ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో కీలక ఆధారాలు నేషనల్‌ ​ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) సంపాదించింది. పేలుడు పదార్థాలు పెట్టినట్టుగా భావిస్తున్న ఇద్దరు అనుమానితుల ఫుటేజీని రిలీజ్‌ చేసింది. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఇజ్రాయిల్‌ ఎంబసీ ముందు అనుమానస్పదంగా తచ్చాడుతూ కనిపించారు. 

జనవరి 29న
2021 జనవరి 29తో ఇజ్రాయిల్‌, ఇండియాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 29 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అలజడి సృష్టించేందుకు కొందరు ఉగ్రవాదులు ప్రయత్నించారు. ఇజ్రాయిల్‌ను ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వడాన్ని నిరసిస్తూ భారీ పేలుడుకు ప్రణాళిక రూపొందించారు. అయితే గట్టి భద్రత ఉండటంతో వాళ్ల ప్లాన్‌ అనుకున్నట్టుగా ఫలించలేదు. జనవరి 29న ఇజ్రాయిల్‌ ఎంబసీ పక్కన ఉన్న జిందాల్‌ హౌజ్‌ ఎదుట ఉన్న పూల కుండీలో పేలుడు పదార్థాలు ఉంచారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో పేలుడు జరిగినా పెద్దగా నష్టం చోటు చేసుకోలేదు. అయితే ఈ పేలుడు వెనుక ఎవరున్నారనే అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. 
 

చదవండి : అయోధ్యలో ‘భూ’కంపం


 

మరిన్ని వార్తలు