మరోసారి కరోనా విజృంభణ.. 14 వరకు కర్ఫ్యూ 

3 Mar, 2021 03:53 IST|Sakshi

పింప్రి: పుణే, పింప్రి–చించ్‌వడ్‌ కార్పొరేషన్‌ పరిధిలో కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు పెంచారు. మాస్క్‌ లేకుండా నగర రహదారులపై తిరుగుతున్న జనంపై అధికారులు కొరడా ఝలిపించారు. మంగళవారం ఒక్కరోజే ఆకస్మిక తనిఖీలు చేపట్టి మాస్క్‌లు లేకుండా తిరుగుతున్న 853 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4.15 లక్షల జరిమానా వసూలు చేశారు. జరిమానా చెల్లించని వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.

కొద్ది రోజులు కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కార్పొరేషన్‌ అధికారులు తనిఖీలు మరమ్మరం  చేశారు. అదేవిధంగా ఇరు నగరాలలో ఇదివరకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు అమలులో ఉన్న కర్ఫ్యూను ఈ నెల 14వ తేదీ వరకు పెంచారు. జంట నగరాల్లో రోజు వేయికి పైగా కరోనా కేసులు, పదుల సంఖ్యలో మృతులు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  

చదవండి: (మీ ఇంట్లో శుభకార్యాలకు మారువేషాల్లో అధికారులు)

>
మరిన్ని వార్తలు