100 మందితో గర్ల్స్‌ హాస్టల్.. రాత్రుళ్లు 89 మంది మిస్సింగ్.. ఏమైనట్లు..?

22 Aug, 2023 20:52 IST|Sakshi

లక్నో: 100 మంది ఉన్నట్లు రిజస్టర్ చేసిన బాలికల రెసిడెన్షియల్ హాస్టల్‌లో రాత్రిళ్లు 89 మంది మిస్ అయ్యారు. ఈ మేరకు రాత్రిపూట అధికారులు తనిఖీలకు వెళ్లగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన బాలికలపై ప్రశ్నించగా.. హాస్టల్ వార్డెన్ సరైన సమాధానం ఇవ్వలేదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

జిల్లాలోని పరాస్‌పూర్‌ ప్రాంతంలో ఉన్న కస్తూర్భా గాంధీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాలలో జిల్లా మెజిస్ట్రేట్ నేహా శర్మా సోమవారం రాత్రి తనిఖీలు చేశారు. రిజిస్టర్‌లో 100 మంది పేర్లు నమోదు చేయగా.. కేవలం 11 మంది మాత్రమే హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వార్డెన్ సరితా సింగ్ సరైన సమాధానం ఇవ్వేలేకపోయారు. దీంతో దర్యాప్తుకు అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

జిల్లా బేసిక్ శిక్షా అధికారి ప్రేమ్ చంద్ యాదవ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ఓ టీచర్, హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్, ఓ జవాన్‌ పేర్లను నమోదు చేశారు. డిపార్టెమెంట్‌ కూడా సదరు వ్యవహారంపై చర్యలు తీసుకుంటోందని ప్రేమ్ చంద్ యాదవ్ తెలిపారు.     

ఇదీ చదవండి: Onion Price Hike: ఉల్లి ధర పెరుగుదల.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

మరిన్ని వార్తలు