Hijab Row: హిజాబ్‌పై స్పందించిన నిఖత్‌ జరీన్‌.. ఆమె ఏమన్నారంటే..?

24 May, 2022 10:58 IST|Sakshi

Boxing world champion Nikhat Zareen.. ఇటీవల హిజాబ్‌ ధరించడంపై దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కర్నాటకలో హిజాబ్‌ కారణంగా ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో అక్కడ కర్ఫ్యూ సైతం విధించారు. హిజాబ్‌ వివాదం ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి విషయం తెలిసిందే. 

ఇదిలా ఉండగా.. తాజాగా హిజాబ్‌ వ్యవహారంపై మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ నిఖత్ జరీన్ స్పందించారు. సోమవారం నేషనల్‌ మీడియాతో ఇంటర్ప్యూలో నిఖత్‌ జరీన్‌ మాట్లాడుతూ.. ‘‘హిజాబ్‌ ధరించడం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. హిజాబ్‌ ధరించడంపై కామెం‍ట్స్‌ చేయడం నాకు ఇష్టం లేదు. హిజాబ్‌ ధరించడాన్ని నేను ఇష్టపడతాను. హిజాబ్ విషయంలో తనకు కానీ, తన కుటుంబానికి కానీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. దుస్తుల విషయంలో  నాకు నా కుటుంబ సభ్యులు స్వేచ్ఛనిచ్చారు. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయాన్ని నేను అస్సలు పట్టించుకోను’’ అని స్పష్టం చేశారు. 

మరోవైపు..  ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించి స్వదేశానికి తిరిగి వచ్చిన నిఖత్‌ జరీన్‌కు స్వదేశంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారిస్ ఒలింపిక్స్‌లో దేశానికి పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని తెలిపారు. ఒలింపిక్స్‌ పతకం కోసం సాధన కొనసాగిస్తానని చెప్పారు.

ఇది కూడా చదవండి: ప్రపంచ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన తెలుగమ్మాయి

మరిన్ని వార్తలు