భర్తకు నివాళిగా సైన్యంలో అడుగుపెట్టిన భార్య

29 May, 2021 16:21 IST|Sakshi

సాక్షి, చెన్నై: పుల్వామాలో ఉగ్రవాదులతో పోరాడుతూ 2019 ఫిబ్రవరిలో భారత ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన భార్య నితికా కౌల్ భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా నియమితులయ్యారు. నితికా కౌల్ శనివారం చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి ఉత్తీర్ణత సాధించారు. ఆమె తన కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి తన భర్తకు నివాళిగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షను క్లియర్ చేసి సైన్యంలో చేరారు.

కాగా దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్‌లో స్పందిస్తూ...నితికా కౌల్‌కు అభినందనలు తెలిపారు. "లెఫ్టినెంట్-నితికా కౌల్, మీరు భారతదేశ నారీ శక్తి స్వరూపం. మీ అంకితభావం, సంకల్పం, భక్తి గొప్పది. మేజర్ విభూతి ధౌండియాల్ ఈ రోజు మీ భుజంపై ఉన్న నక్షత్రాలను చూసి ఆనందం, గర్వంతో నవ్వుతారు.’’ అంటూ ట్వీట్‌ చేశారు. 

(చదవండి: వైరల్‌ వీడియో: పోలీస్‌పై గ్రామస్థుల విచక్షణ రహిత దాడి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు