ఇంధన ధరల మంట.. నిర్మల వివరణ

1 Feb, 2021 14:50 IST|Sakshi

సెస్‌ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తాం

సాక్షి, న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మధ్య తరగతి, వేతన జీవులకు నిరాశ మిగిల్చింది. ముఖ్యంగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యవసాయ సెస్సు విధింపుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెట్రోల్‌ ధర కొన్ని ప్రాంతాల్లో సెంచరీ చేసింది. ఇప్పుడు సెస్‌ విధింపుతో ఇంధనం ధర మరింత ఎగబాకనుంది. లీటర్ పెట్రోల్‌పై‌ 2.50 రూపాయలు, డీజిల్‌పై 4 రూపాయల వ్యవసాయ సెస్సు విధిస్తే.. ధరలు మరింత పెరగనున్నాయి. ఒక్కసారిగా ఇంధన ధరలు పెరిగితే సామాన్యుడి జీవితం మరింత నరకప్రాయమవుతుంది. ఇప్పటికే కూరగాయలు, నిత్యవసరాల ధరలు కొండెక్కాయి. ఇక ఈ వ్యవసాయ సెస్సు విధుంపుతో.. ఇంధన ధరలు పెరిగితే ఆ ప్రభావం.. అన్ని అంశాలపై ఉంటుంది. ఇక అప్పుడు సామాన్యులు ‘ఏం కొనేటట్టులేదు.. ఏం తినేటట్టు లేదు ధరలిట్టా మండిపోతే’ అని పాడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుంది. 
(చదవండి: బడ్జెట్‌ 2021: కొత్తగా 100 సైనిక్‌ స్కూళ్లు)

ఇక వ్యవసాయ సెస్సు విధింపుపై ప్రతిపక్షాలు, సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనిపై స్పందించారు. సెస్సు విధింపు వల్ల పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగబోవని స్పష్టం చేశారు. వ్యవసాయ సెస్‌ విధించి.. ఇతర ట్యాక్స్‌లు తగ్గిస్తామని వెల్లడించారు. సెస్‌ల భారాన్ని సుంకం నుంచి మినహాయిస్తామని.. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు యథాతధంగా ఉంటాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు. (చదవండి: బడ్జెట్‌ 2021: ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే!)


 

మరిన్ని వార్తలు