గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో నీతిఆయోగ్‌ సీఈవో

27 Sep, 2021 02:20 IST|Sakshi
మొక్క నాటుతున్న అమితాబ్‌ కాంత్‌. చిత్రంలో ఎంపీ సంతోష్‌ కుమార్‌ తదితరులు 

ఇంటి ఆవరణలో మూడు మొక్కలు నాటిన అమితాబ్‌ కాంత్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ ఢిల్లీ మోతీబాగ్‌లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమితాబ్‌కాంత్‌ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం నీతిఆయోగ్‌ సీఈవోకు వృక్ష వేదం పుస్తకాన్ని సంతోష్‌ బహూకరించారు. పుస్తక వివరాలతో పాటు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌కి నామినేట్‌ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత పాల్గొన్నారు.  

వైశ్య ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో.. 
సాక్షి, హైదరాబాద్‌: గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ‘ఊరిఊరికో జమ్మిచెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు’ నినాదంతో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా ఆదివారమిక్కడ జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. 

మరిన్ని వార్తలు