క్షమించండి అంటూ నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ

9 Nov, 2022 14:08 IST|Sakshi

భోపాల్‌: కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ మధ్యప్రదేశ్‌లో నాసిరకంగా నిర్మించిన రహదారి విషయమై ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరిగితే క్షమాపణలు కోరడానికి వెనుకడుగు వేయనని అన్నారు. ఈ మేరకు ఆయన మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్‌లోని ఒక అవార్డుల పంక్షన్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన జబల్‌పూర్‌ హైవేకి 63 కి.మీ బరేలా నుంచి మండలానికి సుమారు రూ. 400 కోట్లతో నిర్మించిన రహదారి నాసిరకంగా ఉందంటూ బాధపడ్డారు. దీని గురించి అధికారులతో మాట్లాడాను. ప్రాజెక్టు నిలిపివేయడమో లేక మరమ్తతులు చేయడమో చేస్తాను లేదా కొత్త టెండర్‌ వేయించి మంచి రహదారి అందించేలా చూస్తానని అన్నారు.

ఇప్పటి వరకు మీరంతా ఈ రహదారి కారణంగా ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదర్కొన్నందుకు క్షమాపణలు కోరుతున్నాను అని అన్నారు.  గడ్కరీ గతంలో తన హాయాంలో మధ్యప్రదేశ్‌కి రూ. 6 లక్షల విలువైన రోడ్డు ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ విషయమై భూసేకరణ, అడవుల తొలగింపు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కూడా. ఆ తర్వాత ఫంక్షన్‌ చివరిలో కాంగ్రెస్‌ గూర్చి అన్యూహ్యమైన వ్యాఖ్యలు చేసి బీజేపీని షాక్‌కి గురి చేశారు.

ఈ మేరకు ఆ ఫంక్షన్‌లో మాట్లాడుతూ...2004 నుంచి 2014 మధ్య రెండు కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు నాయకత్వం వహించిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తన ఆర్థిక సంస్కరణలతో సరికొత్త సరళీకరణకు దిశా నిర్ధేశం చేశారంటూ ప్రశంసించారు. ఈ విషయమై దేశం ఆయనకు ఎంతగానో రుణపడి ఉంటుందని కొనియాడారు గడ్కరీ. ఐతే గడ్కరీ ఒక్కోసారి చేసే వ్యాఖ్యలు బీజీపీని ఇబ్బందుల్లోకి నెడుతుంటాయి.

(చదవండి: కేరళ గవర్నర్‌కు షాక్‌.. వర్సిటీల ఛాన్సలర్‌గా తప్పించేందుకు సిద్ధమైన సర్కార్‌)

మరిన్ని వార్తలు