కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ ఉండాల్సిందే : గడ్కరీ 

15 Jan, 2022 08:31 IST|Sakshi

న్యూఢిల్లీ: కారులో కనిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉండటాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఎనిమిది మంది ప్రయాణించగలిగే కారులో తయారీదారులు ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ ఉంచాలని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేశారు.  2019 జూలై 1 నుంచే డ్రైవర్‌ సీట్‌ ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేశామని, ఇక 2022 జనవరి 1 నుంచే డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో ఉన్నవారికి ఎయిర్‌బ్యాగ్‌ ఉండాలన్న నిబంధన అమల్లో ఉందన్నారు. వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికుల దృష్ట్యా ఇప్పుడు అదనంగా మరో నాలుగు ఎయిర్‌బ్యాగ్స్‌ను తప్పనిసరి చేశామని గడ్కరీ తెలిపారు. 

చదవండి: Bipin Rawat Chopper Crash: ప్రతికూల వాతావరణమే కారణం

మరిన్ని వార్తలు