వినూత్నంగా జనగణన..ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన బిహార్‌ సీఎం

7 Jan, 2023 18:23 IST|Sakshi

బిహార్‌లో సరికొత్త విధానంలో జనగణన చేపట్టారు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌. ఈ మేరకు ఆయన బిహార్‌లో కుల ఆధారిత జనగణన చేస్తున్నట్లు తెలిపారు. ఈ కసరత్తు ఉద్దేశం అన్ని వర్గాల ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన కోసం అని స్పష్టం చేశారు. ఈ విధానం అభివృద్ధి పనులు చేయడానికి ఉపకరిస్తుందని చెప్పారు. తాను మొదటి నుంచి దేశవ్యాప్తంగా కుల ఆధారిత జనాభ గణనను నిర్వహించాలని డిమాండ్‌ చేశానని అన్నారు. ఇలా చేస్తే కులాల వారిగా వారి అభ్యున్నతికి కృషి చేయడానికే, గాక వారి స్థితిగతులు తెలియజేస్తాయని చెప్పారు.

వాస్తవానికి 2011లో కులగణనన జరిగిందని, కానీ సరిగా నిర్వహించలేదని చెప్పారు. బిహార్‌లోని అన్ని పార్టీలు కూర్చొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధానిని కలవడానికి వెళ్లాం, కానీ కేంద్రం కుల ప్రాతిపదికన జనాభ గణన చేయదని తేల్చి చెప్పింది. ఒక రాష్ట్రం చేయాలనకుంటే ఓకే గానీ అన్ని రాష్ట్రాలు అలా చేయలేవని  కరాఖండీగా కేంద్రం చెప్పిందని అన్నారు. ఈ మేరకు నితీష్ జాతి ఆధార గణన(కులాల ఆధిరిత గణన) కసరత్తులల్లో అధికారులందరూ పూర్తి శిక్షణ పొందారని, సరిగా చేయగలరని ధీమాగా చెప్పారు.

ప్రతి వ్యక్తిని సరిగా లెక్కించాలని తాము అధికారులను కోరినట్లు పేర్కొన్నారు. చాలా వరకు నగరాల్లోనూ, రాష్టాల వెలుపల జీవిస్తున్నారని అందువల్ల బహు జాగ్రత్తగా మొత్తం సమాచారాన్ని నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు నితీష్‌. కులం లేదా వర్గాల వారిగా ఆయా కుటుంబాల స్థితి గతులను నమోదు చేస్తామని నొక్కి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఫుల్‌ క్లారిటీతో ఉందన్నారు. ఈ విధానంతో ప్రతి కుటుంబం ఆర్థికస్థితి అంచనా వేయగలగడమే కాకుండా సమర్థవంతంగా అభివృద్ధి పనులు చేపట్టి, పేదరికాన్ని నిర్మూలిస్తాం అని చెప్పారు. ఈ నివేదికను కేంద్రానికి పంపిస్తాం, ఒకవేళ బాగుంది అనిపిస్తే వారు ఈ కార్యక్రమానికి పూనకుంటారని లేదంటే తాము కనీసం వారికి ఈ రిపోర్టుని నివేదిస్తాం అని నితీష్‌ చెప్పుకొచ్చారు. 

(చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్‌ ఇండియా సీఈఓ)

మరిన్ని వార్తలు