తనిఖీలు చేస్తుండగా గాయపడ్డ నితీష్‌కుమార్‌

26 Oct, 2022 21:15 IST|Sakshi

పట్నా: బిహార్‌లో గంగానది ఒడ్డున​ అట్టహాసంగా జరిగే ఛత్‌ పూజ నిమిత్తం ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఘాట్ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఆయన కాసేపు విలేకరులతో ముచ్చటించారు.​ ఐతే ఈ వారం తనిఖీలు పడవలో కాకుండా కారులో పర్యవేక్షిస్తున్నారేంట? అని విలేకరులు నితీష్‌ని ప్రశ్నించారు. దీంతో నితీష్‌ కుమార్‌ వివరణ ఇస్తూ... గతవారం తాను పడవలో తనిఖీలు చేస్తుండగా తమ బోటు జేపీ స్తంభాన్ని ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో తాను గాయపడ్డానంటూ తన కుర్తా ఎత్తి మరీ బ్యాండేజ్‌లను చూపించారు.

ఐతే పడవలో ఉ‍న్నవారందరు సురక్షితంగా ఉన్నారని, తమను వేరే పడవలో తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కాలికి కూడా గాయమైందని చెప్పారు. తన పొట్టకు బ్యాండేజ్‌ఉండటంతోనే సీటు బెల్టు వేసుకోలేక కారు ముందు సీటులో కూడా కూర్చొలేదని వివరణ ఇచ్చారు. ఛత్‌పూజ బిహార్‌లో అత్యంత ప్రసిద్ధమైన పండుగ, అందువల్ల మూడు రోజుల పాటు గంగానది వద్ద ఉండే ఘాట్లన్నీ జనసందోహంతో కిటకిటలాడుతుంటుంది.

(చదవండి: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు సోనియా అభినందనలు)

మరిన్ని వార్తలు