నివర్‌ తుఫాన్‌: 26 విమానాలు రద్దు..

25 Nov, 2020 17:54 IST|Sakshi

సాక్షి, చెన్నై : నివర్‌ తీవ్ర తుఫాను ప్రభావంతో తమిళానాడు రాజధాని చెన్నైలో భారీ వర్షం కురిసింది. తుఫాను కారణంగా చెన్నై విమానాశ్రయంలో 26 విమానాలను రద్దు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఏటీఆర్‌ చిన్న విమానం, చెన్నై విమానాశ్రయంలోని టుటికోరిన్, ట్రిచీతోపాటు సేలంకు 12 విమానాలు ఇప్పటికే రద్దు చేశారు. మామల్లపురం చుట్టుపక్కల తీరప్రాంత ప్రజలు, ఫిషింగ్ ప్రాంత ప్రజల భద్రత కోసం అధికారులు ఎత్తైన మైదానాలు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు ఉపయోగించే పడవలు, ఫిషింగ్ నెట్స్ యంత్రాలను 30 మీటర్ల దూరంలో అధికారులు సురక్షితంగా ఉంచారు. తిరుపోరూర్లోని, తిరుక్కలుక్కున్ పరిసరాల్లోని ఉన్న 23 సరస్సులు, 23 చెరువులు పొంగిపొర్లుతున్నాయి. కోయంబత్తూరులో సముద్రంలో అయిదు అడుగుల ఎత్తులో అలలు ఎగసి పడుతున్నాయి.

నిండుకుండను తలపిస్తున్న స్వర్ణముఖి
నెల్లూరు : నెల్లూరు జిల్లా వాకాడులోని వైఎస్సార్ స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. నివర్‌ తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద  వరద నీరు, తెలుగు గంగ నుంచి నీటిని విడుదల చేయడంతో  స్వర్ణముఖి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుంది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. స్వర్ణముఖి నది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యారేజి నీటితో స్వర్ణముఖి పరిధిలోని చెరువులు మొత్తం నిండాయని బ్యారేజ్ అధికారులు తెలిపారు. గతంలో బ్యారేజీ కుడికాలువకు గంగన్న పాలెం వద్ద తెగిపోవడంతో ఆ ప్రాంతం ముందస్తుగా కట్టకు మరమ్మతులు చేస్తున్నారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తుఫాన్ ప్రభావం వల్ల భారీగా కురుస్తున్న వర్షాలతో సముద్రంలోకి వేటకి వచ్చిన 124 తమిళనాడు బోటులు పొర్టులో పార్కింగ్ చేశారు. (నివర్‌ ఎఫెక్ట్‌: ఏపీలో కుండపోత వర్షాలు)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా