ఏడాది చివరకు కాలుష్యరహిత యమున

14 Mar, 2022 06:30 IST|Sakshi

న్యూఢిల్లీ: రాబోయే డిసెంబర్‌ చివరకు యమునా నదిలోకి ఎలాంటి మురికి నీరు చేరదని నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ చెప్పారు. నదిలోకి దారితీసే అన్ని మురుగుకాల్వలను అప్పటికల్లా మూసివేస్తారన్నారు. 1,300కిలోమీటర్ల పొడవున ప్రవహించే యమునా నది దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా నిలుస్తోంది. ఈ నది నుంచి దేశరాజధానికి మంచినీటి సరఫరా జరుగుతోంది. ఢిల్లీలో నది 22 కిలోమీటర్లు మాత్రమే ప్రవహిస్తుంది.

కానీ నదిలోని 98 శాతం కలుషితమంతా ఇక్కడనుంచే వస్తోంది. నదిలోకి మురుగునీరు వదిలే 18 డ్రెయిన్స్‌ ఉన్నాయని, వీటిని మూసివేసి, మురుగునీటిని సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు మళ్లించే పనులు చేపడతామని అశోక్‌ చెప్పారు. ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని నదిలోకి వదులుతారని, దీంతో నదిలో పరిశుభ్రమైన నీరు మాత్రమే ప్రవహిస్తుందని వివరించారు. యమునా నదిని శుభ్రపరిచేందుకు ఎన్‌జీయోధా(నమామి గంగే యమునా ఆఫ్‌ ఢిల్లీ ఏరియా)ను ప్రారంభిస్తామన్నారు.

మరిన్ని వార్తలు