సీఎం కీలక నిర్ణయం.. ఆగస్టు 15న బడులు, ఆఫీసులకు సెలవు రద్దు

15 Jul, 2022 21:18 IST|Sakshi

NO holiday on August 15.. ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే ఆగస్టు 15న విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవును రద్దు చేస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది.

అయితే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఈ ఏడాదికి 75 సంవత్సరాలు పూర్తి కానుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నందున ప్రతీ జిల్లాలో ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే, రాష్ట్రంలో ఇండిపెండెన్స్‌ డేను పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కాగా, వారోత్సవాల్లో ప్రతీరోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించనున్నట్టు స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో యూపీలో స్వచ్చ భారత్‌లో భాగంగా స్వాతంత్ర్య పోరాట యోధులకు సంబంధించిన ప్రదేశాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగానే అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే, ఎన్‌సీసీ, స్కౌట్ విద్యార్ధులతో పాటు స్వచ్ఛంద సంస్థలను, వ్యాపార సంస్థలను కూడా ఇందులో పాల్గొనేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.ఎస్.మిశ్రా మాట్లాడుతూ దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపడతామని, దీనిని జాతీయ ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్నారు.

ఇది కూడా చదవండి: మాజీ సీఎంకు ఊహించని చేదు అనుభవం.. మహిళ చేసిన పనికి షాక్‌

మరిన్ని వార్తలు