ఉపాధ్యాయులకు షాక్‌.. క్లాస్‌ రూమ్స్‌లో ఫోన్ల వాడకంపై ఆంక్షలు

24 Mar, 2022 15:32 IST|Sakshi

డెహ్రాడూన్‌: క్లాస్‌ రూమ్స్‌లో ఫోన్లు వాడే టీచర్లకు బిగ్‌ షాక్‌ తగిలింది. క్లాస్‌ రూమ్‌ల్లోకి సెల్‌ ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ జిల్లా మేజిస్ట‍్రేట్‌ వినయ్‌ శంకర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎవరైనా టీచర్ల వద్ద క్లాస్‌ రూమ్స్‌లో ఫోన్లు కలిగి ఉన్నట్టు తేలితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ రూల్‌ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తరగతి గదుల్లో కూడా ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్‌లతో బిజీగా ఉండటం చాలా కాలంగా గమినిస్తున్నట్టు చెప్పారు. ఫోన్లలో బిజీగా గేమ్స్‌ ఆడటం, చాటింగ్‌లు చేయడం వంటివి గుర్తించినట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రుల నుండి తమకు చాలా కాలంగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అలాగే విద్యార్థులు, ఫిర్యాదులను ధృవీకరించడానికి అధికారులను పంపించినట్టు తెలిపారు. అయితే, ఉపాధ్యాయులు తమ మొబైల్ ఫోన్‌లను పాఠశాలలకు తీసుకెళ్లవచ్చు కానీ.. ఫోన్లను ప్రిన్సిపాల్ గదిలో భద్రపరచాలని స్పష్టం చేశారు. వారు మొబైల్ ఫోన్లు లేకుండా తరగతి గదిలోకి ప్రవేశించాలని ఆదేశాలు జారీ చేసినట్టు పాండే చెప్పారు.

అయితే, టీచర్‌ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో మినహాయింపు ఇవ్వవచ్చని తెలియజేసారు. కాగా, ప్రిన్సిపాల్‌ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఫోన్‌ తమ వద్ద పెట్టుకోవచ్చనని సూచించారు. ఈ క్రమంలోనే తమ ఆకస్మిక తనిఖీల్లో ఎవరైనా ఉపాధ్యాయులు ఫోన్‌ను వాడుతున్నట్టు గమినిస్తే.. కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రిన్సిపాల్‌ కూడా బాధ్యత వహించాలన్నారు. 

మరిన్ని వార్తలు