ఉమ్మడి పౌర స్మృతిపై కమిటీ వేయలేదు: కేంద్రం

29 Jul, 2022 06:12 IST|Sakshi
న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు

న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)అమలుపై ప్రత్యేకంగా కమిటీని వేయాలన్న ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్రం తెలిపింది. అయితే, ఈ అంశానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి ప్రతిపాదనలు తయారు చేయాలని న్యాయశాఖను కోరినట్లు వెల్లడించింది. న్యాయ మంత్రి కిరణ్‌ రిజిజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ప్రస్తుతానికి యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని చెప్పారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి తీసుకువచ్చే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్‌–44 ద్వారా కేంద్రానికి ఉందన్నారు. దేశంలో ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామంటూ 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ హామీ ఇచ్చింది.

మరిన్ని వార్తలు