Covid Vaccine: టీకాతో వ్యంధ్యత్వం రాదు

1 Jul, 2021 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పురుషులు, మహిళల్లో వ్యంధ్యత్వానికి (ఇన్‌ఫెర్టిలిటీ) కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కారణమవుతోందన్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. కరోనా వ్యాక్సిన్‌ పూర్తి సురక్షితం, ప్రభావవంతం అని గుర్తుచేసింది. పాలిచ్చే తల్లులు సైతం కరోనా టీకా తీసుకోవచ్చని జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొంది. టీకా తీసుకోవడానికి ముందు, తీసుకున్న తర్వాత బిడ్డకు పాలివ్వడం మానాల్సిన అవసరం లేదని సూచించిందని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు