వ్యాక్సిన్ విష‌యంలో ప్ర‌భుత్వ తీరు ఆందోళ‌న‌క‌రం

27 Aug, 2020 12:54 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. భార‌త్‌లో 33 ల‌క్ష‌ల‌కు పైగా ప్ర‌జ‌లు కోవిడ్ బారిన‌ప‌డినా  వ్యాక్సిన్‌కు సంబంధించి ప్ర‌భుత్వం చేస్తున్న జాప్యం చాలా ఆందోళ‌న‌క‌రంగా ఉందంటూ మండిప‌డ్డారు.  'క‌రోనా వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేసే దేశాలలో భార‌త్ కూడా ఒక‌టి. అయితే ఎప్ప‌టిలోగా వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌స్తుంది, ధ‌ర‌, పంపిణీ విధానాలు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌భుత్వం వ‌ద్ద ఎలాంటి  స్ప‌ష్ట‌త  లేదు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి ఓ స్ర్టాట‌జీ అమ‌ల్లో ఉండాలి. కానీ అలాంటి సంకేతాలు ఏమీ కనిపించ‌డం లేదు' అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో దేశ  ఆర్థిక సంక్షోభంపై   తాను హెచ్చ‌రించినా కేంద్రం ప‌ట్టించుకోలేదంటూ రాహుల్ పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొన్ని నెల‌లుగా తాను  చెబుతున్న  విషయాన్నే ఇప్పుడు ఆర్‌బీఐ వార్షిక నివేదికలో కూడా పేర్కొందంటూ కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ట్వీట్ చేస్తూ వినియోగాన్ని ప్రోత్స‌హించి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించాలంటూ  ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ('నేను అప్పుడే హెచ్చ‌రించినా ప‌ట్టించుకోలేదు')

 ప్ర‌స్తుతం భార‌త్‌లో మూడు సంస్థ‌లు టీకా త‌యారీలో ముందున్నాయి. ఇప్ప‌టికే సీరం  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకా త‌యారీలో 3వ ద‌శ‌లో ఉంది. భార‌త్ బ‌యోటెక్, జైడుస్ కాడిలా త‌యారు చేస్తున్న టీకా మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్‌ను పూర్తిచేసుకుంది అని ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ (డాక్టర్) బలరామ్ భార్గవ ఇటీవ‌లె ప్ర‌కటించారు.  ఇక ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ కు సంబంధించి దేశంలో 3వ దశ ట్రయల్స్ ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింన సంగ‌తి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ తయారీకి అనుమతి పొందిన పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ ఇప్ప‌టికే మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ఏ విధంగా దుమారం రేపుతాయో అని ప‌లువురు కామెంట్లు చేస్తున్నారు. (కరోనా వ్యాక్సిన్ : సీరం గుడ్ న్యూస్ )


 

మరిన్ని వార్తలు