Noida:సెక్షన్‌ 144 విధింపు.. నూతన మార్గదర్శకాలివే

1 Jun, 2021 11:55 IST|Sakshi

లక్నో: దేశమంతటా కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు మహమ్మారి కట్టడికై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. నైట్ కర్ఫ్యూ, లాక్‌డౌన్ లాంటి ఆంక్షలు విధించి కరోనా కట్టడికి నిరంతరం శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడంతో మళ్లీ వాటి గడువును పెంచుతున్నాయి. తాజాగా క‌రోనావైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాలో జూన్‌ 30 వరకు 144 విధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. మరోవైపు నోయిడాలో కోవిడ్‌ కేసుల సంఖ్య 62,356కు పెరిగింది. ప్రస్తుతం 1,073 యాక్టివ్‌ కేసులున్నాయి.

చదవండి: మద్యం హోం డెలివరీకి ఢిల్లీ ప్రభుత్వం అనుమతి

కొత్త మార్గదర్శకాలు ఇలా...
1. వైద్య, అవసరమైన సేవలు మినహా అన్ని కార్యకలాపాలు కంటైన్‌మెంట్‌ జోన్లలో నిషేధం
2. ముందస్తు అనుమతి లేకుండా అన్ని సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, వినోద కార్యక్రమాలు బంద్‌.
3. క్రీడా కార్యక్రమాలు, ఉత్సవాలు కూడా నిషేధం
4. పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు మూసివేసి ఉంటాయి.
5. కోచింగ్ సెంటర్లు, సినిమా హాల్స్, జిమ్స్, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్బులు, షాపింగ్ మాల్స్ అన్ని మూసివేత
6.  వివాహ కార్యక్రమానికి 25 మందికి మించకూడదు.
7 దహన సంస్కారాల కోసం 20 మందికి మించకూడదు.
8. రెస్టారెంట్లు అన్ని మూసివేత.  అయితే హోమ్ డెలివరీ సేవలకు అనుమతి
9.  ప్రజా రవాణా (మెట్రోలు, బస్సులు, క్యాబ్‌లు మొదలైనవి) 50 శాతం వరకు ఆక్యుపెన్సీతో పనిచేస్తాయి. 
10. తగిన ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రజా నిరసనలకు అనుమతి లేదు.
11. బహిరంగ ప్రదేశాల్లో మద్యం,ఇతర పదార్థాల వినియోగం అనుమతి లేదు..

మరిన్ని వార్తలు