‘పద్మ’ నామినేషన్లకు ఆఖరు తేదీ 15

23 Aug, 2022 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: పద్మ అవార్డులు–2023కు ఆన్‌లైన్‌ ద్వారా నామినేషన్లు, సిఫారసుల స్వీకరణకు సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కేంద్ర హోం శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులకు ఆన్‌లైన్‌ పోర్టల్‌ https:// awards.gov.in ద్వారా మాత్రమే సిఫారసులు పంపాల్సి ఉంటుందని పేర్కొంది. విశిష్ట సేవలందించిన వారికి దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీలను కేంద్రం ఏటా గణతంత్ర దినోత్సవం నాడు ప్రకటిస్తుంది.

ప్రతిపాదనలను, నామినేషన్లను ఇతరుల గురించి, లేదా తమకు తాముగా 800 పదాల్లో వివరిస్తూ పంపుకోవచ్చునని హోం శాఖ తెలిపింది.  అదేవిధంగా, నేషనల్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్‌ ఇన్‌ ఫారెస్ట్రీ–2022కు, నేషనల్‌ గోపాలరత్న–2022కు, నేషనల్‌ వాటర్‌ అవార్డ్స్‌కు సెప్టెంబర్‌ 30 ఆఖరు తేదీ అని తెలిపింది. నారీశక్తి పురస్కార్‌–2023కి అక్టోబర్‌ 31 చివరి తేదీ అని వివరించింది. 

మరిన్ని వార్తలు