‘తండ్రిలా తప్పు చేయొద్దు..’ స్వామి పిటిషన్‌.. స్టాలిన్‌ సర్కార్‌కు సుప్రీం నోటీసులు

29 Aug, 2022 16:27 IST|Sakshi

ఢిల్లీ/చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆలయాల్లో బ్రహ్మణేతరులను అర్చకులుగా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ ఆధారంగా.. నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్‌ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. 

బీజేపీ నేత సుబ్రమణియన్‌ స్వామి ఈ మేరకు సుప్రీం కోర్టులో స్టాలిన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. ఆలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడం, బ్రహ్మణేతరులను ఆలయ అర్చుకులుగా నియమించడం లాంటి స్టాలిన్‌ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ స్వామి ఈ పిటిషన్‌ వేశారు. 

తమిళనాడులో డీఎంకే అధికారంలోకి రాగానే.. ఎన్నికల హామీలో భాగంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని కులాల వాళ్లను ఆలయ అర్చుకులుగా నియమిస్తామని మాటిచ్చారు ఆయన. ఈ మేరకు అర్చక శిక్షణ తీసుకున్న పలువురిని కిందటిఏడాదిలో అగస్టులో అర్చకులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో హిందూ రెలిజియస్‌ అండ్‌ చారిటబుల్‌ ఎండోమెంట్‌ విభాగం.. సుమారు 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. 

అయితే.. ఈ నియామకాలపై బీజేపీ నేత స్వామి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తండ్రి కరుణానిధిలాగే.. తనయుడు స్టాలిన్‌ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని, దీనిపై కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు కూడా. ఈ మేరకు ‘‘స్టాలిన్‌.. ఆయన తండ్రిలాగా ఆలయాల విషయంలో తప్పులు చేయరనే అనుకుంటున్నా. స్టాలిన్‌ 2014లో సభనాయాగర్‌ నటరాజ్‌ ఆలయ విషయంలో సుప్రీం కోర్టు నుంచి చివాట్లు తిన్న విషయం మరిచిపోయారేమో!. ఇప్పుడు ఆలయాల అర్చకుల విషయంలో తప్పు చేస్తుంటే ఊరుకోను. కోర్టుకు వెళ్లాల్సి వస్తే.. వెళ్తానంటూ కిందటి ఏడాది ఆగస్టులో స్వామి ఓ ట్వీట్‌ కూడా చేశారు.

ఇదీ చదవండి: ఇంటి నుంచి వెళ్లగొట్టారు.. ఆజాద్‌ ఆవేదన

మరిన్ని వార్తలు