అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు

16 Mar, 2021 18:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదని, బ్యాంకు ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించబడుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తొమ్మిది యూనియన్లు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. "ప్రైవేటీకరణ నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగుతాయని పబ్లిక్‌ ఎంటర్‌ప్రైస్‌ పాలసీ స్పష్టంగా చెబుతోంది. అలాంటప్పుడు అన్ని ప్రభుత్వ బ్యాంకులను విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించట్లేదు. ప్రైవేటీకరించే బ్యాంకుల ప్రతి సిబ్బంది వేతనాలు, పింఛన్లు వంటి ప్రయోజనాలను తాము రక్షిస్తామని" సీతారామన్ అన్నారు.

నేడు దేశవ్యాప్తంగా కీలకమైన బ్యాంకింగ్ కార్యకలాపాలు సమ్మె వల్ల మూతపడ్డాయి. రూ.1.75 లక్షల కోట్లు సమీకరణ కోసం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలనే ప్రభుత్వ ప్రణాళికతో ఈ సమ్మె ప్రారంభమైంది. 2022 ఆర్థిక సంవత్సరం మొత్తం పెట్టుబడులను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. పీఎస్‌బీల్లో వేల సంఖ్యలో ఉద్యోగులు ఉండటంతో ప్రైవేటీకరణ ప్రక్రియపై ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఉదాహరణకు.. యూనియన్ల గణాంకాల ప్రకారం బీవోఐలో 50,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. అలాగే సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 33,000 మంది, ఐవోబీలో 26,000 మంది, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 13,000 మంది దాకా సిబ్బంది ఉన్నారు.

చదవండి:

హోమ్‌లోన్ తీసుకునేముందు ఇవి గమనించండి!

కరోనా కాలంలో ఎగుమతుల జోరు‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు