కరోనాను జయించిన ఊబకాయ మహిళ

7 Oct, 2020 17:58 IST|Sakshi

ముంబాయి: ప్రపంచంలో ప్రస్తుతం అందరిని వణికిస్తున్న వ్యాధి కరోనా. ఈ వ్యాధి లక్షణాలు ఒక్కొక్కరిలో  ఒక్కోలా ఉంటున్నాయి. కొంతమందికి లక్షణాలు పైకి కనిపిస్తుంటే, కొంతమందిలో అసలు లక్షణాలే కనిపించడంలేదు. మరికొంత మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక షుగర్‌, బీపీ, ఉబకాయ సమస్యలు ఉన్నవారికి కరోనా రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది.   ముఖ్యంగా ఊబకాయులకు కరోనా సమస్య అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అయితే 172 కేజీల బరువు, క్యాన్సర్‌, ఆస్తమా ఇలా అనేక రకాల వ్యాధులు ఉన్న ఒక మహిళ మాత్రం కరోనాతో యుద్దం చేసి గెలిచింది. 
 
 వైద్యులను సైతం ఆశ్చర్యపరుస్తూ భారతదేశానికి చెందిన 62 ఏళ్ల మహిళ కరోనాను  జయించింది. ముంబైకి చెందిన మెహ్నాజ్ లోఖండ్‌వాలా అనే మహిళ కరోనా చికిత్స కోసం ముంబైలోని ఒక ఆసుపత్రిలో చేరింది. మహిళ 172 కేజీల బరువు ఉండటమే కాదు దానితో పాటు ఆమెకు మధుమేహం, ఉబ్బసం, క్యాన్సర్‌లాంటి ఇతర వ్యాధులు కూడా ఉన్నాయి. అయితే రోగికి సకాలంలో చికిత్స  చేయడం ద్వారా కరోనా నుంచి రక్షించవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెహ్నాజ్ లోఖండ్‌వాలా అనే రోగిని తెల్లవారు జామున 2 గంటల సమయంలో బొంబాయి ఆసుపత్రిలో చేర్పించారు.  అప్పటికి ఆమె ఆక్సిజన్‌ లెవల్స్‌ 83-84కు పడిపోయాయి. దాంతో ఆమెకు నాలుగురోజుల పాటు ఆక్సిజన్‌ను పెట్టారు. తరువాత ఆమె కోలుకుంది. ఆసుపత్రిలో రోజుకు 15 లీటర్ల ఆక్సిజన్‌ అందించగా, ప్రస్తుతం ఒక లీటర్‌ ఆక్సిజన్‌ మద్దతుతో ఆమె ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు.  

చదవండి: కరోనా సోకిన అగ్ర నేతలు వీరే !


 

మరిన్ని వార్తలు